సంచారమే ఎంతో బాగున్నది
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందమేదున్నది
ఇల్లు పొల్లు లేని ముల్లె మూట లేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని
సంచారమే..
జ్ణానం సంచారమే
గానం సంచారమే
లోన సంచారమే
ఆ సంచారమే ఎంతో బాగున్నది
సేదతీర సెరువు కట్టున్నడి
నీడకోసం సింత చెట్టున్నది
జోలనూపె గాలి పిట్టున్నది
గుర్తులేని గుడ్డి నిదరున్నది
బరువు దిగిన గుండె బలెవున్నది
సంచారమే..
సిప్పోలె మోదుగు దొప్పున్నది
సిటారు కొమ్మన తేనె పట్టున్నది
జోపితే జోరైన తీపున్నది
రూపులేనాకలి చూపున్నది
ఆకలంత అదృష్టం ఏదున్నది
సంచారమే ఎంతో బాగున్నది
కిరిటమేమో భారం ఏమున్నది
దాన్ని కిందేసితే బరువే లేకున్నది
చెప్పులు తెగిపొయ్న మేలున్నవి
ముళ్ళతుప్పలేవో తెలిసిపోతున్నవి
కాలిమట్టికేదో మహిమున్నది
తేళ్ళు పురుగులు తొలగిపోతున్నవి
సంచారమే ఎంతో బాగున్నది
స గ నా రే..
పండువండిన జాన పండ్లున్నవి
తెంపుకుంటె నోటికింపున్నది
సేదు గింజెల్లేవో దాగున్నవి
నమిలే కొద్ది తీపినిస్తున్నవి
దారిబత్తెం..
దారిబత్తెం కరువు లేకున్నది
రాలిపడ్డవి రాసులుగనున్నవి
ఊరి ఊరికి దారులేరున్నవి
ఊటలోలె బాటలొస్తున్నవి
బాట పక్కన వింత పూలున్నవి
తోవ ఎంత నడిసిన విసుగే లేకున్నది
గాలి గంధామోలె వస్తున్నది
గాలి గంధామయ్యి వస్తున్నది
ఖాళీగుంటె కడుపు నింపు తున్నది
సంచారమే..
మంచుతో మెరిసేటి కొండున్నది
మహిమాలాతొవ్వెంట సెవ్విన్నది
అంచువోతే సలి తంతున్నది
కొంచం యెడమవోతెనె ఏదో మేలున్నది
మురిపాల మెరుపులు కట్టున్నవి
దాటిపోతే నడక తీరే వేరున్నది
సంచారమే..
పారేటీ వెన్నెల ఏరున్నది
స్వారికేమో పడగ సైగున్నది
బరువున్నవారైతే బరువన్నది
లేకుంటెనే లేడి పరువన్నది
పైనవన్నీ వదులుకొమ్మన్నవి
పైరగాలి తడిపి(?) పోతున్నది
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందమేమున్నది